హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాయంపేటలో వైద్య శిబిరం, ఇంటింటా సర్వే

PDPL: ధర్మారం మండలం శాయంపేటలో జ్వరాల వ్యాప్తితో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారి ఉప్పులేటి సుస్మిత పరీక్షలు నిర్వహించారు. హెచ్ఈఓ నరసింహారెడ్డి, ఎంహెచ్ఏ దామోదర్ రెడ్డి ఇంటింటా సర్వే చేశారు. ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు. సర్పంచ్ కూసా శ్రీవాణి సమన్వయం చేశారు. శిబిరం మూడు నాలుగు రోజులు కొనసాగించి యాంటీ లార్వా చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.