హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటోపై ఫ్లెక్సీతో తల్లిదండ్రుల ఆవేదన

HYD: గత నెల 31న నాగోల్‌లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వరుణ్, మహేష్‌ అనే ఇద్దరు పిల్లలు 24 రోజులైనా ఇంటికి చేరలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లల ఫొటోలతో ఆటోపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నగరమంతా తిరుగుతూ వారి కోసం గాలిస్తున్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని వేడుకుంటున్నారు.