ADB: ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లు రాజేశ్వర్, చిత్రూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజావాణికి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. పరిష్కారంలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'దరఖాస్తులు పెండింగ్ పెడితే చర్యలు తప్పవు'


