హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పొగమంచులో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి'

SRCL: జిల్లాలో పొగమంచు కారణంగా రహదారులపై దృశ్యమానత తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండా సిరిసిల్ల పోలీసులు సూచించారు. వాహనాల వేగాన్ని తగ్గించి, ముందు వెళ్తున్న వాహనాలకు తగినంత దూరం పాటించాలని కోరారు. లైట్లు వినియోగిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వాహనదారుల భద్రతే తమ ప్రాధాన్యమని, సురక్షిత ప్రయాణమే లక్ష్యమని తెలిపారు.