హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు గ్రామాలకు ఆర్టీసీ సేవలు

WNP: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో మోజర్ల, మద్దిగట్ల, అమ్మపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసు పునరుద్ధరించారు. కరోనా సమయంలో నిలిచిపోయిన బస్సు తిరిగి ప్రారంభం కావడంతో మూడు గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. బస్సు సర్వీసు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.