హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో సోమవారం అరికట్ల శివమోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ.50,000 ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.