హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి దీపాల నిర్వహణ.. ఒకే సంస్థకు పదేళ్ల కాంట్రాక్ట్!

HYD: ORR పరిధిలో వీధి దీపాల నిర్వహణ వ్యయం రూ.1,341.60 కోట్ల నుంచి రూ.1,720.83 కోట్లకు పెరిగింది. అదనపు పన్నులు, పర్యవేక్షణ ఖర్చులతో కలిపి మరో రూ.379 కోట్ల భారం పడుతోంది. మూడు కార్పొరేషన్లలోని 7.60 లక్షల ఎల్ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యతలను పదేళ్లపాటు ఒకే సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నాణ్యత, పనితీరు పర్యవేక్షణ బాధ్యతలు OU చేపట్టనుంది.