హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

WGL: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక కందుల రాకేష్ అనే 22 ఏళ్ల యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోవడంతో రికవరీ ఏజెంట్లు తరచూ ఫోన్ కాల్స్‌తో వేధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు.