HNK: రైల్వే ప్రయాణికులకు ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. కాజీపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు అధిక బరువు కారణంగా భువనగిరి వద్ద ఆగిపోయింది. దీంతో వెనుక వస్తున్న కాజీపేట-సికింద్రాబాద్ పుష్‌పుల్ రైలును యాదాద్రి సమీపంలో రెండున్నర గంటలపాటు నిలిపివేశారు. అదనపు ఇంజిన్లతో గూడ్స్‌ను తరలించాక రైలు కదిలింది. కనీస సౌకర్యాలు లేని చోట రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణ
బరువులాగలేక మొరాయించిన గూడ్స్ రైలు


