NLG: కనగల్ మండలం ధర్మశిపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. జమదగ్ని మహర్షి పురాణ గాథతో ముడిపడిన ఈ క్షేత్రంలో అమ్మవారు పుట్టలో నాగదేవత రూపంలో కొలువై ఉన్నారు. తమ కష్టాలను తొలగించి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు కొలుస్తూ నిత్యం దర్శనానికి తరలివస్తుంటారు.
తెలంగాణ
పుట్టలో వెలసిన అమ్మవారికి పూజలు


