NRPT: మక్తల్ పట్టణ శివారులో కట్రావల్లి రోడ్డు వెంబడి, గొల్లపల్లి పరిసరాల్లో 10 నుంచి 20 వరకు ఇటుక బట్టీలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దుమ్ము, వేడి, కాలుష్యంతో శ్వాస సమస్యలు వస్తున్నాయని, సమీప సమీకృత పాఠశాల విద్యార్థులకూ ముప్పని వాపోయారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవని, 10 కిలోమీటర్ల అవతలికి తరలించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
మక్తల్లో అనుమతిలేని ఇటుక బట్టీలు


