MNCL: మందమర్రి మండలం, తుర్కపల్లిలో గల మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద సోమవారం పైపు లీకై నీరు వృథాగా పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు నీటిని వృథా చేయవద్దని అధికారులు చెబుతున్నా, ఇలా పైపు లీకై నీరు వృథాగా పోతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పైపుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద పైపు లీకై నీరు వృథా


