హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో ట్రాఫిక్ రద్ధీని తగ్గించేందుకు 'రోప్ వే'

HYD: నగరంలో ట్రాఫిక్ రద్ధీని తగ్గించడానికి, పర్యటకాన్ని అభివృద్ధి చేయడానికి రోప్ వే ప్రాజెక్టులకు ఇప్పటికే HMDA, పర్యాటకశాఖలు సంయుక్తంగా ప్రతిపాదనలు చేశాయి. పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని గోల్కొండ కోట నుంచి కుతుబ్‌షాహీ సమాధుల మధ్య రోప్‌వే ఏర్పాటు ప్రణాళికను HMDA సిద్ధం చేసింది. సుమారు రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో (PPP విధానంలో) 1.5 కి.మీ. మేర ఏర్పాటు చేయనున్నారు.