హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంటలో ప్లాస్టిక్ వాడకం జోరు

KNR: జమ్మికుంట పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోంది. 120 మైక్రాన్లలోపు క్యారీ బ్యాగులపై 2022 డిసెంబర్ 31 నుంచే నిషేధం ఉన్నా, చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు వాడకం తగ్గలేదు. అప్పుడప్పుడు తనిఖీలు, జరిమానాలే తప్ప శాశ్వత పరిష్కారం లేదని, పెద్ద వ్యాపారులను వదిలేస్తున్నారని చిరు వ్యాపారులు వాపోతున్నారు.