హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుహలో దుర్గా మల్లేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు!

SRD: శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలోని గుహలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారికి ఇవాళ వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం గావించి, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం మంగళహారతులు సమర్పించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు