హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమెజాన్‌కు భూముల అప్పగింతపై అభ్యంతరం

RR: షాబాద్ మండలం పెద్దవేడులో అమెజాన్ కంపెనీకి ప్రభుత్వ భూముల కేటాయింపుపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భూములను కంపెనీకి అప్పగించే ముందే గ్రామ అవసరాలైన నర్సరీ, క్రీడా ప్రాంగణం కోసం స్థలాన్ని కేటాయించాలని సర్పంచ్ చక్కటి రాజ్య సులోచన కోరారు. పాత పాఠశాల సమీపంలో నివసిస్తున్న ప్రజలకు ప్రత్యామ్నాయ స్థలాలు కల్పించి, వారికి హామీ ఇచ్చిన తర్వాతే భూ కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు.