హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాక్సింగ్ పోటీల్లో జిల్లాకి కాంస్య పతకం

SKLM: విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఐదుగురు క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు రజత పతకాలు, ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. ఎంవీఎస్ గాయత్రి కాంస్య పతకం సాధించగా, ఆమె తండ్రి శాస్త్రి అభినందనలు తెలిపారు. కోచ్ ఉమామహేశ్వరరావు వద్ద గాయత్రి పొందుతున్న శిక్షణ, సాధనకు ఈ ఫలితం దక్కిందని పేర్కొన్నారు.