పార్వతీపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బెలగాం కరుణ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి విధుల్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఛైర్మన్ జయబాబు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారులతో మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనులు, తాగునీరు, మౌలిక వసతులపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్‌పర్సన్‌గా తొలి సంతకం చేసిన కరుణ


