హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లకు ఆఖరు గడువు

కర్నూలు: కోడుమూరు మండలంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే వారికి నేడే చివరి అవకాశం. నేడు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని ఎంపీడీవో రాముడు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. చివరి రోజును అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.