హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కావెంజర్ల ఐదు నెలల వేతనాలేవి?

SRD: సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 1,620 మంది స్కావెంజర్లకు ఐదు నెలలుగా వేతనాలు అందడం లేదు. జిల్లాలోని 1,250 ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వీరికి జూన్ నుంచి అక్టోబర్ వరకు రూ.2.50 కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. ఈ విషయాన్ని అధికారులు స్పందించాలని కోరుతున్నారు.