హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన బొలేరో వాహనం

ASR: డుంబ్రిగుడ మండలంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని జగ్దల్‌పూర్ నుంచి కూరగాయల లోడుతో నర్సీపట్నం వెళ్తున్న బొలేరో వాహనం దట్టమైన పొగమంచు కారణంగా అదుపుతప్పింది. ఈ క్రమంలో జైపూర్ జంక్షన్, శరత్‌నగర్ సమీపంలో రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.