హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 24న రాజంపేటలో కార్తిక దీపోత్సవం

KDP: రాజంపేటలోని ఈడిగపాలెం వరసిద్ధి వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఈ నెల 24న కార్తిక దీపోత్సవం నిర్వహించనున్నారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఉత్సవం జరుగుతుందని ఆలయ ధర్మకర్త చంద్రమౌళి తెలిపారు. మంగళవారం కృత్తికా నక్షత్రంతో కలిసి పౌర్ణమి తిథి రావడం చాలా అరుదని, అందువల్ల ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.