BHNG: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని చెరువుకట్టపై ఈరోజు తెల్లవారుజామున కారు అదుపుతప్పి వాసం ప్రసాద్ ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోడ పూర్తిగా కూలిపోగా, శిథిలాలు పడి ఆవరణలోని బైక్ ధ్వంసమైంది. ఫంక్షన్‌కు వచ్చి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న నలుగురికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
మోత్కూరు చెరువుకట్టపై కారు బీభత్సం


