హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. మల్లేశం

BHNG: ఆర్టీఐ రక్షక్ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రామన్నపేట మండలానికి చెందిన డా. కొండ మల్లేశం గౌడ్ నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపకుడు ఆవనగంటి సతీశ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుతో పాటు అవినీతి నిర్మూలనకు కృషి చేస్తానని మల్లేశం గౌడ్ తెలిపారు.