హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15 సర్పంచులు, 362 వార్డులు ఏకగ్రీవం

కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్‌ పరిధిలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. 136 పంచాయతీలకు గాను 15 సర్పంచి, 362 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అత్యధికం కూటమి ఖాతాలోకే చేరాయి. గుడ్లవల్లేరు మండలంలో అత్యధికంగా 6 సర్పంచి, 86 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల ఈ నెల 26న పోలింగ్ జరగనుంది.