హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక కేంద్రంగా కోయిలకొండ కోట

MBNR: కోయిలకొండ మండలంలోని కొండపై ఉన్న కోట తెలంగాణలో ప్రసిద్ధ గిరిదుర్గం. 14వ శతాబ్దంలో నిర్మితమైన ఇది విజయనగర, పద్మనాయక, కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ పాలకుల కాలంలో కీలక రక్షణ కేంద్రంగా నిలిచింది. పటిష్ఠమైన కోట గోడలు, బురుజులు, జలాశయాలు, ఆలయాలు, దర్గాలతో పాటు, సమీపంలోని కోయిల్‌ సాగర్ ప్రాజెక్టు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.