హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తపల్లి గోరిలో ఏటీఎం ఏర్పాటు చేయాలి

BHPL: కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో ఏటీఎం ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు బ్యాంకు అధికారులను కోరుతున్నారు. మండల కేంద్రంలో గ్రామీణ బ్యాంకు ఉన్నప్పటికీ ఏటీఎం సౌకర్యం లేక ఖాతాదారులు నగదు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. మండల పరిధిలోని 16 గ్రామపంచాయతీల ప్రజల ఇబ్బందులను గుర్తించి అధికారులు వెంటనే ఏటీఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.