హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్‌లో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

VSP: రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి దిగి గల్లంతైన కోటవీధికి చెందిన విద్యార్థి సయ్యద్ జాహిద్ రజా మృతదేహం సోమవారం లభ్యమైంది. సముద్రంలో తేలుతున్న మృతదేహాన్ని స్కూబా డైవర్లు గుర్తించి మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. లైఫ్ గార్డులు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినట్లు సీఐ అశోక్ తెలిపారు. విద్యార్థి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.