ATP: యాడికి మండలం రాయలచెరువు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుప్పాల గ్రామానికి చెందిన టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
యాడికిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ


