SKLM: కవిటి మండలం ఆర్ కరాపాడు జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న శివాలయం వద్ద కార్తీక సోమవారం కావడంతో భక్తులు తాకిడి పెరిగింది. ఆలయ పరిసర ప్రాంతంలోకి ఓ మయూరి (నెమలి) ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. మయూరిని చూసిన భక్తులు ఆనందంతో తమ సెల్ ఫోన్ లో బంధించారు. కాసేపటికి ఆ మయూరి అక్కడి నుంచి సమీప పొదల్లోకి జారుకుంది.
ఆంధ్రప్రదేశ్
కవిటిలో భక్తులకు దర్శనమిచ్చిన నెమలి


