హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనారోగ్యంతో గిరిజన విద్యార్థిని మృతి

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం కీసర గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని పత్తిక నందిక (11) ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈమె గుమ్మలక్ష్మీపురం KGBVలో 6వ తరగతి చదువుతోంది. ఆరోగ్యం బాగాలేకపోవడంతో భద్రగిరి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు పార్వతీపురం రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలిక మృతి చెందినట్లు సమాచారం.