కోనసీమ: ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామానికి చెందిన కోమలి రామస్వామి (90), పద్మావతి (83) దంపతులు మరణంలోనూ ఒక్కటయ్యారు. వృద్ధాప్యంతో శనివారం అర్ధరాత్రి పద్మావతి మృతి చెందగా, భార్య మరణాన్ని తట్టుకోలేక రామస్వామి అరగంట వ్యవధిలోనే కన్నుమూశారు. ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం సాయంత్రం దంపతులిద్దరికీ అంత్యక్రియలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అరగంట వ్యవధిలో దంపతులు మృతి!


