GDWL: అలంపూర్ పట్టణంలోని రెండో వార్డులో అండర్ డ్రైనేజీ సమస్య కారణంగా మురుగునీరు రోడ్డు పై ప్రవహిస్తుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి అటు పాఠశాల విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రెండు వారాల నుంచి సమస్య ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డుపై మురుగు నీరు... రాకపోకలకు ఇబ్బంది


