SRPT: రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఉత్సవంగా పేరొందిన చివ్వెంల గ్రామంలోని లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర వచ్చే ఫిబ్రవరిలో ఐదు రోజుల పాటు జరగనుంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. గుట్ట చుట్టూ వంటావార్పులు చేసుకుంటూ సందడి చేస్తారు. అయితే ఈసారి భక్తుల రాకకు అనుగుణంగా విశాలమైన స్థలాల కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ
పెద్దగట్టు జాతరకు సన్నాహాలు.. స్థలాల కొరత!


