హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలారం పంచాయతీ సర్పంచ్‌గా వరలక్ష్మి ఏకగ్రీవం

ASR: జిల్లాలో ఇప్పటివరకు కొయ్యూరు మండలం బాలారం పంచాయతీ మాత్రమే ఏకగ్రీవమైంది. సర్పంచ్‌తో పాటు 8వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ స్థానానికి 10మంది, వార్డులకు 17మంది నామినేషన్లు వేయగా.. టీడీపీ నేతల సమన్వయంతో 9 మంది సర్పంచ్ అభ్యర్థులు, 9మంది వార్డు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ మద్దతుదారు ఈదుల వరలక్ష్మి సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యారు.