హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు చిట్యాల, టేకుమట్ల మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

BHPL: చిట్యాల, టేకుమట్ల మండలాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇవాళ పర్యటించనున్నారు. తొమ్మిది గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోరింది.