హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి–సంధిగూడ మార్గంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం ట్రాక్టర్‌ను ఢీకొనడంతో సప్పగూడ గ్రామానికి చెందిన పీ. సంగమేసు (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో యువకుడు ఎన్. గురుమూర్తి (22) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు.