హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టణంలో ఫ్లెక్సీల బీభత్సం

NLG: మిర్యాలగూడ పట్టణంలో పుట్టినరోజులు, పెళ్లిరోజులు, వ్యాపార ప్రకటనల పేరుతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట అనుమతులు లేకుండా పెడుతున్న బ్యానర్లతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పురపాలికకు ఆదాయం రాకపోగా, వాటి తొలగింపునకు అదనపు ఖర్చు అవుతోంది. ఈదులగూడలో ఫ్లెక్సీ సీసీ కెమెరాలకు అడ్డంగా ఉండటంతో దొంగను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.