హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

JGL: జగిత్యాల బైపాస్ రోడ్డులో సాయిబాబా గుడి సమీపంలోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లోని వాషింగ్ మిషన్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది.