సిద్దిపేట జిల్లా కొహెడ విజయ డెయిరీ ద్వారా తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారంతో పాడి రైతులకు పశువుల కొనుగోలుకు రుణాలు మంజూరయ్యాయి. రాగుల లక్ష్మి, అజ్మీర చంద్రకళ సహా తొమ్మిది మంది లబ్ధిదారులకు అందాయి. డెయిరీ అధ్యక్షుడు జాలిగం శంకర్ పశు బీమా, దాణా సాయం అందిస్తామని, నాణ్యమైన పాలు పోయాలని కోరారు. కొత్తగా డెయిరీ ఫారాలు ప్రారంభించే రైతులకూ సహాయం చేస్తామన్నారు.
తెలంగాణ
కొహెడ పాడి రైతులకు రుణాలు మంజూరు


