హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర పోశారు.. రోడ్డు వేయడం మరిచారు

JN: రఘునాథపల్లి నుంచి పాలకుర్తికి వెళ్లే మెయిన్ రోడ్ గుంతలమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. మరమ్మతుల పేరుతో కేవలం కంకర పోసి వదిలేయడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కంచనపల్లి,రామన్నగూడెం గ్రామాల ప్రజలు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రివేళ కంకర, గుంతలతో ప్రమాదాల భయం నెలకొంది. అధికారులు స్పందించి రోడ్డును పూర్తి చేయాలని స్థానికులు కోరారు.