PDPL: రామగుండం గోదావరిఖని పవర్ హౌస్ కాలనీ శివాలయం వద్ద సింగరేణి ఉద్యోగి రాజశేఖర్ ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సప్తగిరి కాలనీకి చెందిన ఆయనకు ఫోన్ రావడంతో బయటకు రాగా, గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
అర్ధరాత్రి సింగరేణి ఉద్యోగి దారుణ హత్య


