హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల పాత బస్టాండ్ వద్ద వరుస ప్రమాదాలు

బాపట్ల: పాత బస్టాండ్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. అదే సమయంలో మరో బైక్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ వరుస ప్రమాదాల్లో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.