కర్నూలు: ఆదోని మండలం ఇంద్రనగర్ కాలనీకి చెందిన నరసింహులు అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. రెండేళ్ల క్రితం భార్య రత్నకుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల పరిస్థితి హృదయవిదారకంగా మారింది. కుటుంబంలో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
భార్య, భర్త ఇద్దరు మృతి.. అనాథలైన పిల్లలు


