హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరవు మండలాల ప్రకటనపై రైతుల అసంతృప్తి

MLG: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో సాగునీరు లేక వందల ఎకరాల్లో వరిపంటలు ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడులు నష్టపోయి అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. గోవిందరావుపేట, మంగపేట, వెంకటాపూర్, ఏటూరునాగారం మండలాలను మాత్రమే ప్రభుత్వం కరవుగా ప్రకటించింది. కానీ మిగిలిన ఆరు మండలాల్లోనూ కరవు ఛాయలు నెలకొన్నాయి. ప్రభుత్వం స్పందించి కరవు మండలాల నిర్ణయంలో మరోసారి ఆలోచించాలని అన్నదాతలు కోరుతున్నారు.