హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తిలో సహజ ప్రసవాలపై ర్యాలీ

WNP: సహజ ప్రసవాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ వనపర్తిలో ఆదివారం నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పాలిటెక్నిక్ నుంచి వివేకానంద చౌరస్తా, ఇందిరాగాంధీ చౌరస్తా, డిపో రోడ్డు మీదుగా బస్టాండ్ వరకు సాగింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రయాణికులతో మాట్లాడి, తల్లీబిడ్డలకు సహజ ప్రసవం మేలని, వైద్యపరంగా అవసరమైతేనే సిజేరియన్ చేయించుకోవాలని సూచించారు.