NLG: తిప్పర్తి మండలంలోని గ్రామాలకు డి-39, డి-40 కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేశారు. రైతుల అవసరాలు తీర్చాలని డిమాండ్ చేసిన ఆయన, నీటిపారుదల అధికారులకు రెండు రోజుల గడువు ఇచ్చారు. ఆలోపు నీరు విడుదల చేయకపోతే తామే కాలువ గేట్లు తెరుస్తామని, అవసరమైతే తాళాలు పగులగొడతామని హెచ్చరించారు.
తెలంగాణ
సాగునీటి కోసం మాజీ ఎమ్మెల్యే నిరసన


