హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టులో భక్తులకు బస్సుల కష్టాలు..!

JGL: కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దర్శనం తర్వాత దిగువన బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. బస్సులు దూరంగా ఆపుతుండటంతో చంటిపిల్లలు, వృద్ధులు పరిగెత్తుతూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొండగట్టుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.