హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపికపై ఉత్కంఠకు తెర

గుంటూరు: తెనాలి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. ఐదేళ్ల పదవీకాలంలో ఏడాదికి ఒక్కొక్కరు చొప్పున టీడీపీ కౌన్సిలర్లు వైస్ ఛైర్మన్‌గా కొనసాగేందుకు ఒప్పందం కుదిరింది. తొలి విడతలో 25వ వార్డు కౌన్సిలర్, టీడీపీ సీనియర్ నాయకుడు పసుపులేటి త్రిమూర్తిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఈరోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు.