హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రత్నంపేట ప్రచారంలో ఎమ్మెల్యే నిరసన సెగ!

AKP: రత్నంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో నిన్న రాత్రి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మద్దతుదారు పిట్ల బుల్లిబాబు తరఫున ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుకు జనసేన మద్దతుదారు పెద్దాడ నాగేశ్వరరావు వర్గీయుల నుంచి నిరసన ఎదురైంది. ఇరువర్గాల నినాదాలు, తోపులాటతో గ్రామంలో వాతావరణం వేడెక్కడంతో ఎమ్మెల్యే ప్రచారాన్ని ముగించుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు.